Saturday, November 15, 2025
HomeతెలంగాణSeethakka: మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

Seethakka: మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క(Seethakka) మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తిని సకాలంలో ఆదుకున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా వెళుతున్న ఒక వాహనదారుడికి మూర్ఛ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న సీతక్క తన కాన్వాయ్‌ ఆపి అస్వస్థతకు గురైన వ్యక్తి వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

ఆ వ్యక్తి చేతిలో తాళం చెవులు ఉంచి స్పృహలోకి వచ్చేంత వరకు ఆమె అక్కడే ఉన్నారు. తక్షణ వైద్య సహాయం కోసం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆమే దగ్గరుండి సపర్యలు చేయడాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. ఆమె గతంలో కూడా పలు సందర్భాల్లో చేసిన సామాజిక సేవను గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad