Sunday, November 16, 2025
HomeTop StoriesAnganwadi recruitment:గుడ్‌న్యూస్.. నియామకాల ప్ర‌క్రియ వేగ‌వంతం.. అధికారులతో మంత్రి సీత‌క్క‌ సమీక్ష

Anganwadi recruitment:గుడ్‌న్యూస్.. నియామకాల ప్ర‌క్రియ వేగ‌వంతం.. అధికారులతో మంత్రి సీత‌క్క‌ సమీక్ష

Anganwadi recruitment: రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న సుమారు 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నియామకాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను తక్షణమే వెకేట్‌ చేయించేందుకు చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్క ఈ అంశంపై లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌, పీఆర్సీ ఛైర్మన్‌ ఎన్‌. శివశంకర్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి ఓజా సైతం పాల్గొన్నారు.

- Advertisement -

రిజర్వేషన్ల అసలైన సమస్య: గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో భర్తీ చేసిన పోస్టులను ఎస్టీల‌కు రిజర్వ్‌ చేశారు. దీంతో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటింది. అయితే ఈ అంశంపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు స్టే విధించింది. మంత్రి సీతక్క ఈ అంశంపై అధికారులతో చర్చించి.. సుప్రీంకోర్టు స్టేను తొలిగించేందుకుతగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆయా రాష్ట్రాల్లో అంగన్‌వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్‌ కిందకు రాకపోవడం వల్ల 50 శాతం రిజర్వేషన్ పరిమితి వర్తించదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/heavy-rains-cyclone-montha-effect-on-telangana/

10 రోజుల్లో మార్గం సుగమం చేయాలని ఆదేశం: అధికారులు అధ్యయనం చేసి నివేదికను పరిశీలించిన మంత్రి సీతక్క.. తెలంగాణలో కూడా మిగితా రాష్ట్రాల్లో అమలయ్యే విధానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు స్టేను వెకేట్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సుప్రీంకోర్టులో వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. 10 రోజుల్లోగా నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్త నియామకాలు ద్వారా అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేస్తాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 14 వేల మంది నిరుద్యోగులకు ఇది శుభవార్త అనడంలో సందేహం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad