ఈ సమ్మర్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య అస్సలు తలత్తరాదని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈమేరకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీచేశారు. సమ్మర్ స్పెషల్ డ్రైవ్ లో డిపిఓ, డిఎల్పిఓ, ఎంపిఓ, విలేజ్ సెక్రెటరీ, సీ ఈ నుంచి ఏఈఈ వరకు మిషన్ భగీరథ అధికారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు.
మిషన్ భగీరథ పంపులను, నల్లా పైపులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమస్యలు ఏమున్నా ముందుగానే వాటిని సరిదిద్దాలన్నారు. ఏదైనా సమస్యతో మిషన్ భగీరథ సరఫరాలో సమస్యలు తలెత్తినా ఆల్టర్నేటివ్ పద్ధతిలో నీరు సరఫరా చేసేలా ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క ఈరోజు సమీక్షించారు.