Tuesday, June 17, 2025
HomeతెలంగాణSeethakka: కేటీఆర్ జైలుకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు.. మంత్రి సీతక్క సెటైర్లు

Seethakka: కేటీఆర్ జైలుకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు.. మంత్రి సీతక్క సెటైర్లు


Seethakka Comments on KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నట్లు అర్థమవుతోందని మంత్రి సీతక్క సెటైర్లు వేశారు. వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారని తెలిపారు.

సోదరి కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లి వచ్చి బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని.. దీంతో తాను వెనుకబడ్డాననే భావనతో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే తాను కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ చాలా అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏదో ఆశించి మరి కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకుని ఇప్పుడు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు సంస్థలే తేలుస్తాయని సీతక్క స్పష్టం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు.

కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. విచారణకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచారని, ముప్పైసార్లు పిలిచినా తాను హాజరవుతానని తెలిపారు. తనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను జైలుకు వెళ్లి వచ్చానని తనకు జైళ్లు కొత్తేమీ కాదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News