Friday, April 4, 2025
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: మాది పేదల ప్రభుత్వం

Singireddy Niranjan Reddy: మాది పేదల ప్రభుత్వం

పథకాలను ఏకరువు పెట్టిన మంత్రి

సామాన్యులకు అండగా ఆసరా ఫించన్లు.. రూ.200 ఫించన్ రూ.2016 చేశాం, రూ.500 ఫించన్ రూ.4016 చేశాం, రూ.2016 ఫించన్ రూ.5000, రూ.4016 ఫించన్ రూ.6000 పెంచి చూయిస్తాం.. పేదల వంట భారం తగ్గించేందుకే రూ.400 సిలిండర్, ప్రతి కుటుంబానికి ధీమా .. కేసీఆర్ రూ.5 లక్షల భీమా, రేషన్ కార్డు మీద ఇక నుండి సన్నబియ్యం, సామాన్యుల అభ్యున్నతి లక్ష్యంగా కేసీఅర్ ప్రభుత్వ పాలన వనపర్తి జిల్లా కేంద్రంలో అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్దరించి ట్యాంక్ బండ్ లుగా మార్చాం, మరుగునపడ్డ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దాం, 11 పార్కులను అహ్లాదకరంగా తీర్చిదిద్ది ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశాం.. రూ.425 కోట్ల ప్రత్యేక నిధులతో వనపర్తికి మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా మౌళిక వసతుల కల్పన.

- Advertisement -

వనపర్తి జిల్లాకేంద్రంలోని 3వ వార్డు పోచమ్మగుడి కాలనీలో వార్డు నిద్ర చేసి ఈ ఉదయం 1,2 వార్డులలో పర్యటించి ఈ ఎన్నికల్లో అండగా నిలవాలని ప్రజల ఆశీర్వాదం కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News