Tuesday, June 24, 2025
HomeతెలంగాణUttam kumar Reddy: మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Uttam kumar Reddy: మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kumar Reddy) సూర్యాపేట జిల్లా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చింతలపాలెం మండలంలోని కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఎంబీసీ నక్కగూడెం రాజీవ్ గాంధీ లిఫ్ట్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు ఆయన వెళ్లాల్సి ఉంది. అయితే కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో అత్యవసరంగా మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అక్కడి నుంచి మంత్రి నేరుగా హుజూర్ నగర్ చేరుకున్నారు. ఆ తర్వాత అంజలి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం అయ్యారు. కాగా హుజుర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News