Ministers Invitation to KCR for Medaram Jatara: ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు ఆహ్వానించేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిశారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. రాజకీయాలకతీతంగా అతిథి మర్యాదలతో సత్కరించారు.
ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వానం అందింది. గురువారం మంత్రులు ధనసరి అనసూయ(సీతక్క), కొండా సురేఖ.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను “బాగున్నారా అమ్మా” అని కేసీఆర్ అప్యాయంగా పలకరించారు. కేసీఆర్ దంపతులు వారిని పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించారు.
మేడారం మహాజాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత గౌ.శ్రీ @KCRBRSPresident గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు హాజరుకావాలని ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికను… pic.twitter.com/cHzcAVYLMK
— Konda Surekha (@iamkondasurekha) January 8, 2026
కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను, ప్రసాదంను అందజేసిన మంత్రులు.. జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. అనంతరం వారు ఇచ్చిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర స్వాగతం పలికారు.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-government-official-events-lavish-menu-dttdc/
మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP
— Telangana Congress (@INCTelangana) January 8, 2026
సమ్మక్క- సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను స్వీకరించిన కేసీఆర్.. సానుకూలంగా స్పందించారు. జాతరకు తప్పకుండా వస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను ఈ జాతరకు ఆహ్వానించినట్లు మంత్రి సీతక్క ఈ సందర్భంగా పేర్కొన్నారు.

