తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను వెదజెల్లుతున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పథకాలను నిరుపేద అడబిడ్డలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలో షాబునగర్ లోని ఏఆర్సీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా 485 మంది లబ్ధిదారులకు (మిర్యాలగూడ పట్టణం-219 మంది, మిర్యాలగూడ మండలం-178 మంది, వేములపల్లి మండలం -59 మంది, మాడ్గులపల్లి మండలం -29 మంది) మంజూరైన 4కోట్ల 85లక్షల 56వేల 260 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి పంపిణీ చేశారు.