మిస్ వరల్డ్(Miss World 2025) పోటీదారుల బృందం యాదగిరిగుట్టను(Yadagirigutta) సందర్శించారు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి పర్యటన సందర్భంగా సాధారణ భక్తుల దర్శనాలు, జోడు సేవలకు బ్రేక్ ఇచ్చారు. ఆలయ అధికారులు ఈ బృందానికి ఘన స్వాగతం పలికారు.
ఈ బృందం వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. అలాగే భూదాన్ పోచంపల్లిని మరో పోటీదారుల బృందం సందర్శిస్తోంది. కాగా హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా సుందరీమణులు తరలివచ్చారు.