Saturday, September 21, 2024
HomeతెలంగాణMLA Chander: ఆరోగ్య తెలంగాణ కేసీఆర్ లక్ష్యం

MLA Chander: ఆరోగ్య తెలంగాణ కేసీఆర్ లక్ష్యం

అందరికీ ఆరోగ్యం ఇంటింటా సౌభాగ్యం అందరూ చల్లగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతం అవుతుందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ ఆవరతణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన్టీపీసీ లక్ష్మి నరసింహ గార్డెన్స్ లో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవానికి రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు న్యూట్రిషన్ కిట్ లను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య విప్లవం వచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాల మాత్రమే ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నైపుణ్యం 26 మెడికల్ కళాశాలలో రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నా మెడికల్ కళాశాల కలను సహకారం తాము చేశామని, సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ప్రారంభించామని ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. మెడికల్ కళాశాలలో ఈ సంవత్సరం 150 మంది వేడుకలు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.

- Advertisement -

గర్భిణీ స్త్రీలలో పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపాన్ని నివారించడం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమతుల పౌష్టికాహారాన్ని అందించడానికి ఆరోగ్య లక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించి మాతృ మరణాలను తగ్గించడం కోసం గర్భిణీ స్త్రీలకు 5వ నెల నుండి మొదలుకొని 9వ నెల వరకు ప్రతినెల రెండు రూపాయల విలువ చేసే న్యూట్రిషన్ కిట్ సిఎం కేసీఆర్‌ అందిస్తున్నారన్నారు.
సమైక్య పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో
ఆదర్శమైన పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అన్నారు. ఈ కార్యాలయంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, కార్పోరేటర్లు ధరని స్వరూప జలపతి, కవిత సరోజీని తో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News