కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలోని కమ్మరి చెరువులో ఉచిత చేప పిల్లల విత్తనాలను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే విడుదల చేశారు. 95400 చేప పిల్లలను విడుదల చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి వరదా రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతు తెలంగాణ రాకముందు వచ్చిన తరవాత జరిగిన అభివృద్ధిని వివరించారు. రాయితీ పైన వ్యాపార నిమిత్తం వాహనాలను అందచేశామని, మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రానికి కూడా చేపలను ఎగుమతి చేస్తున్నారని, మత్స్యకారులు ఎవ్వరు కూడా ఇంకొకరి దగ్గర చేయి చాచే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, సొసైటీ చైర్మన్ బాలాజీ (బాలు శ్రీహరి), బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, నాగరాజు, డాక్టర్ రాజు, నాయకులు పాషా సెట్, గంగాధర్, శంకర్, మత్స్యశాఖ సంగం నాయకులు ఉన్నారు.