మున్నూరు కాపు కులబంధవులకు సిఎం కేసీఆర్ తగిన గౌరవం అందిస్తున్నరని వారికి అండగా నిలుస్తున్నరని రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ సప్తగిరి కాలనిలో 20 లక్షల ఎసిఢిపి నిధులతో మున్నూరుకాపు సంఘ భవన నిర్మణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు కులబంధవులకు భవన నిర్మాణానికి సిఎం కేసీఆర్ స్దలాన్ని కేటాయుంచారన్నారు. మున్నూరు కాపు కులస్తులు అందరిని పార్థీలకు ఆతీతంగా కలుపుకుపోవాలన్నారు. గత పదెళ్ల కాలంలో సంఘ భవన నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. తాము ఎమ్మెల్యే గా గెలిచిన రెండు సంవత్సరాల కాలం కారోనా రావడంతో ముగిసిపోయుందనన్నారు. భవన నిర్మాణానికి ఎసిడిపి నిధుల ద్వారా 20 లక్షలు మున్సిపల్ నుండి మరో 40 లక్షల రూపాయల కెటాయుంచని తెలిపారు.
మున్నూరు కాపు కులబంధవులు కలసి కట్టుగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు పెంట రాజేష్, దాతు శ్రీనివాస్ కొమ్ము వేణుగోపాల్ కౌశిక లత కౌశిక హరి మున్నూరు కాపు సంఘ నాయకులు లైసెట్టి రాజయ్య ముచ్చకుర్తి చంద్రమౌళి ఇందూరి సత్యనారాయణ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాస్ గంగ శ్రీనివాస్ రాకం వేణు అచ్చె వేణు ధరని జలపతి చెలకలపల్లి శ్రీనివాస్ తోట వేణు పీచర శ్రీనివాస్ ఆడప శ్రీనివాస్ నారాయణదాసు మారుతి ఇనుముల సత్యం అర్శనపల్లి శ్రీనివాస్ ఇసంపల్లి తిరుపతి పుట్ట రమేష్ కుడుదల శ్రీనివాస్ దేవిలక్ష్మి నర్సయ్య బస్వాపూర్ గంగరాజ్ వంగ వీరస్వామి పాల్గొన్నారు.