రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్ సభలో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎంతో సాహసోపేతంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి రైతులతో కలిసి ఆనందంతో నృత్యం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులను విస్మరించి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించి అప్పుల తెలంగాణగా మిగిల్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని పార్టీ అని మరో మారు నిరూపించారని ఆయన అన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఎడ్ల బండి పై ర్యాలీగా బయలుదేరి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ వలిగొండ మండల, పట్టణ, అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని లింగయ్య, గరిసే రవి, మాజీఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పల్సం సతీష్ గౌడ్, మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్, కాసుల వెంకన్న, పాలకూర వెంకటేశం, వంగాల అశోక్ గౌడ్, చెరుకు శివయ్య, రేఖల ప్రభాకర్ , బద్ధం సంజీవరెడ్డి,బత్తిని సైదులు గౌడ్, చిలుగూరి సత్తిరెడ్డి,బత్తిని నాగేష్ గౌడ్, మహమ్మద్ సయ్యద్ బాబా, కొండూరు సాయి, బత్తిని అరుణ్ , ఎమ్మె లింగస్వామి, పసునూరి లింగస్వామి, మైసొల్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.