MLA Mallareddy comments on MLC Kavitha: కవిత రాజీనామా వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలోకి కవిత రాజీనామా అనేది పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమని అన్నారు. దీనిపై తాను బయటి వ్యక్తిగా వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. అయితే, కవిత రాజీనామా వెనుక కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు కేసీఆర్ మాత్రమే నాయకుడు: బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు కేసీఆర్ మాత్రమే నాయకుడిగా ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా పార్టీలో ఏర్పడిన రాజకీయ సమీకరణాలతో కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విభేదాల ఫలితంగానే కవిత రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కవిత రాజీనామా వ్యవహారం కేవలం ఆమె వ్యక్తిగత నిర్ణయం కాదని.. పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఫలితమని మల్లారెడ్డి పేర్కొన్నారు.


