Thursday, September 19, 2024
HomeతెలంగాణMLA Rasamai: రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి

MLA Rasamai: రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రైతులకు వెంటనే అయన క్షమా పణ చెప్పాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాల కిషన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…గత టీడీపీ పాలనలో పెంచిన కరెంటు బిల్లులు దించాలని, కరెంటు కోతలు విధిస్తున్నారని మనస్తాపం చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కరెంట్ ఇవ్వాలని అడిగిన పాపానికి బషీర్బాగ్ లో రైతులను కాల్చి చంపిన నీచ చరిత్ర టీడీపీ దని, అందుకే తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ జెండా ఎత్తి పెట్టినటువంటి రోజును ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 2014లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా మొట్ట మొదటి సంతకమే రైతులకు 24 గంటల కరెంట్ ఫైల్ పై సంతకం పెట్టా రని వివరించారు. రైతుల్లో దేవుని చూసినటువంటి తొలి ముఖ్యమంత్రి కూడా మన కేసీఆర్ అని చెప్పారని, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటుతో పాటు,. సాగునీరు, పెట్టుబడి, బీమా ఇస్తూ రైతు సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా కెసిఆర్ భావిస్తు న్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులంతా సంతోషంగా ఉంటే ఓర్వలేని రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత 24 గంటల కరెంటు ఇవ్వద్దని, కేవలం మూడు గంటలు ఇస్తేనే చాలు అంటూ రైతులను అవమాన పరచడమే కాకుండా మళ్లీ రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా అనుచితంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుకోవడానికి నాడు తెలంగాణ బిడ్డల మీదనే చంద్రబాబు తొత్తుగా మారి తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నారని రసమయి పేర్కొన్నారు. పార్టీ మారినా రేవంత్ గుణాలు మాత్రం మార్చుకోలేదని, మేక వన్నె పులి లా, రంగులు మార్చిన ఊసరవెల్లిలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వాక్యాలను నిరసిస్తూ మానకొండూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో నేడు,రేపు రెండు రోజుల పాటు బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల దహనం, పిండ ప్రధానం లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు మరియు బీ.ఆర్. ఎస్.పార్టీశ్రేణులకు ఎమ్మెల్యే రసమయి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల రమేష్ తో పాటు ప్రజా ప్రతిని ధులు, రైతు బంధు, రైతు సమన్వయ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News