మహబూబాబాద్ జిల్లాలోని హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ కలిసి హోంగార్డులు కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతనందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో
జంపయ్య, మసూద్, ఎల్లగౌడ్, శంకరాచారి, సంజీవ, పాషా, మల్లయ్య, శ్రావణ్ తదితరులు ఉన్నారు.
MLA Sankar Naik: హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఎమ్మెల్యేకు వినతి పత్రమిచ్చిన హోం గార్డులు