పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్.. కేసీఆర్ మాట ఇచ్చినట్టు ఇల్లు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని మూడోసారి ఆశీర్వదించాలన్నారు సతీష్. పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ 260 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలు పంపిణి చేశారు. హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో 260 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ .
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పేదల సొంతింటికల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మిస్తుందని కొనియాడారు. ఇల్లు ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించి పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి అని అన్నారు. ఇటీవల లక్కీ డ్రాలో రెండు పడకల గదులు దక్కించుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే గౌరవ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారుల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహలక్ష్మి పథకం వర్తింపచేసి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తుందని గృహలక్ష్మి పథకాన్ని అర్హులందరూ వినియోగించుకొని ఇల్లు నిర్మించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ మెన్ ఎంపీపీ జడ్పిటిసి కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.