Saturday, November 23, 2024
HomeతెలంగాణMLA Satish: అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ పల్లెలు

MLA Satish: అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ పల్లెలు

సంక్షేమ పథకాల పంపిణీలో ఎమ్మెల్యే బిజీ

తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో ముందున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన గ్రామాలు నేడు దేశస్థాయిలో అవార్డులు సాధిస్తున్నాయని, మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్టంలో సిద్ధిస్తోంది.గ్రామీణ తెలంగాణలో మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

కోహెడ మండలంలో కాచాపూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన, 16 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని అలాగే 1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు, పరివేద గ్రామం నుండి పందిళ్ళ గ్రామం వరకు 1కోటి 34 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన,కోహెడ మండలం నకిరేకొమ్ముల నుండి పరివేద వరకు 36 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, నకిరేకొమ్ముల గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ,కోహెడ మండల కేంద్రం నుండి మైసంపల్లి వరకు 1కోటి 90 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో 22 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు,కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో 26 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, 12 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభం, ఎర్రగుంటపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు ప్రతిచోట ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు మంగళ హారతులతో డప్పుచప్పులతో ఘన స్వాగతం పలికారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.

వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు గ్రామాలలో సామాజిక భవనాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని,స్వరాష్టం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని, నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

కోహెడ మండల కేంద్రంలో వివిధ గ్రామాల102 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 1కోటి 2లక్షల 11వేల832 రూపాయల విలువగల చెక్కులు, సీఎంఆర్ఎఫ్ 21 మంది లబ్ధిదారులకు 6లక్షల 69 వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఇప్పటివరకు కోహెడ మండలంలో 1977 మంది లబ్ధిదారులకు 18 కోట్ల 81 లక్షల,7 వేల124 విలువగల చెక్కులను పంపిణీ చేశామని హుస్నాబాద్ నియోజకవర్గంలో 12,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను 112 కోట్ల 22 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కోహెడ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారని ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన విలేకరులకు నా తోడ్పాటునందిస్తానన్నారు అలాగే ప్రెస్ క్లబ్ కు ఎల్లవేళలా సహకరిస్తానని తెలిపారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ & పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కోహెడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తిప్పారపు జ్యోతి- శ్రీకాంత్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు లింగారెడ్డి, రాజేశ్వరరావు, తిరుపతి, శ్రీనివాస్, రవి, రజిత, వెంకటరెడ్డి, అంజయ్య, తిరుపతిరెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, దొంగల తిరుపతిరెడ్డి, ముంజ సంపత్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రతి పంట కొనుగోలు చేసి, మద్దతు ధరను కల్పిస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నూతన సభ్యులను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News