జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, 12 లక్షలతో నిర్మించే పద్మశాలి, ముదిరాజ్, మహిళల సంఘ భవనాల నిర్మాణానికి, గౌరాపూర్ , చెప్యాల గోదాంల 1కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుబంధు పథకం రాకముందు రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఏడు సంవత్సరాల క్రితం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. కరెంటు లేని పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు సహాయం, కాళేశ్వరం నీళ్ల ద్వారా సశ్యశామలం, రైతుబీమా ద్వారా రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే 5లక్షల బీమా అందజేయడం, ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.