తెలంగాణ ఎమ్మెల్యే కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు(MLC Candidates) పీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్‌తో పాటు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం.. మహేష్ కుమార్ గౌడ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని.. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా సోమవారం వీరంతా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కగా.. వాటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.