Saturday, November 15, 2025
HomeతెలంగాణKavitha: ఆ 'లిల్లీపుట్' నా గురించి మాట్లాడతారా?.. ఇదంతా ఆ పెద్ద నాయకుడి కుట్ర!

Kavitha: ఆ ‘లిల్లీపుట్’ నా గురించి మాట్లాడతారా?.. ఇదంతా ఆ పెద్ద నాయకుడి కుట్ర!

MLC Kavitha Sensational comments on BRS leaders: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలోని ఒక సీనియర్ నాయకుడు తనపై కుట్ర చేస్తున్నారని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన ‘లిల్లీపుట్’ నేతకు తన గురించి మాట్లాడే అర్హత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ బయటకు లీక్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ లీక్ వెనుక ఎవరున్నారని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

‘‘ ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎందుకు నోరు మెదపలేదు? నల్గొండలో పార్టీ ఓటమికి కారణమైన ఆ ‘లిల్లీపుట్’ నేత నా గురించి మాట్లాడుతారా? కేసీఆర్‌ లేకపోతే ఆ నాయకుడు ఎవరు? మా నాన్నకు రాసిన లేఖ ఎవరు లీక్ చేశారు? నాపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద నాయకుడు’’ అని కవిత విమర్శలు గుప్పించారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-rythu-bima-2025-26-starts-aug-14-targets-48-lakh-farmers-full-details-are-here/

కాగా, ఇటీవల మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..  కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఆమె గురించి మాట్లాడటం టేమ్ వేస్ట్. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. పార్టీ దాటి బయటకు వెళ్తే ఆమెకు ఏ విలువ ఉండదు అని  ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత.. లిల్లిపుట్ అని జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-assembly-speaker-is-going-to-disqualify-three-mlas-soon-roumours-circulated/

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని… విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తూ.. దీక్షకు దిగనున్నారు. ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇదే విషయంపై అనుమతి కోసం పోలీసులను సంప్రదించగా…  అనుమతులపై ఇంకా స్పష్టత రాలేదు.  ’’బీసీ రిజర్వేషన్ల కోసం నేను పోరాడుతా. ప్రభుత్వం లేదా కోర్టు అనుమతి లేకపోతే, ఇంటి నుంచే దీక్ష చేస్తాను. నా వెనుక ప్రభుత్వం ఉందని చెప్పే వారు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో నిమగ్నమైన వారే. వారి ఆరోపణలకు నేను లొంగను’’ అని కవిత తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad