Teenamar Mallanna Gunmens Surrender: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీసీ రిజర్వేషన్లు తమ క్రెడిట్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మల్లన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా క్యూన్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయండ తీవ్ర దుమారం రేపింది.
ఈ దాడి నేపథ్యంలో జాగృతి కార్యకర్తలపై మల్లన్న గన్‌మన్లు కాల్పులు జరడపం కలకం రేపింది. దీంతో పోలీసుశాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇదర్దు గన్‌మన్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. మల్లన్న ఆదేశాలతోనే తాము కాల్పులు జరిపినట్లు వారు విచారణలో తేల్చిచెప్పారు. ఈ క్రమంలో గన్‌మన్లను సరెండర్ చేసింది.
మరోవైపు మల్లన్నపై జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు మల్లన్నపై రాచకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కవిత గురించి మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూన్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా తమపై దాడి చేశారని పేర్కొన్నారు.అంతేకాకుండా తుపాకులతో చంపేస్తామంటూ మహిళలను బెదిరించారని తెలిపారు. దీంతో మల్లన్నపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో తమపై దాడికి దిగారని తీన్మార్ మల్లన్న కేసు నమోదు చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేయడమే కాకుండా తనను హత్య చేసేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కవితతో పాటు జాగృతి కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు.
Also Read: కవిత మల్లన్న సమస్యపై తొలిసారి స్పందించిన BRS.. ఏమందంటే?
ఇక కవిత అయితే మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కలిశారు. అలాగే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేయనన్నారు. మహిళలను అగౌరవపరిచేలా మల్లన్న వ్యాఖ్యానించారంటూ ఆమె మండిపడ్డారు. బీసీల కోసం పోరాడుతున్న తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. అయితే బీసీలకు కవితకు ఏం సంబంధం అని మల్లన్న ప్రశ్నిస్తున్నారు. బీసీలపై దాడికి పూరికొల్పిన కవితను రాష్ట్రంలో తిరగనివ్వమని.. రాజకీయంగా సమాధి చేసే వరకు పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


