భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రక్తదానం చేశారు.
- Advertisement -
అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశ ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధాని మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.