Friday, September 20, 2024
HomeతెలంగాణMoinabad: 111 జీవో ఎత్తేయటంపై ఫుల్ ఖుష్

Moinabad: 111 జీవో ఎత్తేయటంపై ఫుల్ ఖుష్

111 జీవో పూర్తిగా ఎత్తి వేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటారనీ చేవెళ్ళ నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మొయినాబాద్ మండల పరిధిలోని కుత్బుద్ధీన్ గూడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమ్మరి ఈశ్వర్, మాజీ సర్పంచ్ ఎండి పాషా, ఎండి మెహమూద్, ఎండి యాసీన్, అబ్దుల్ ఖుద్దుస్, ఫసియొద్దీన్ లు ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఈ జీవో కారణంగా చేవెళ్ళ నియోజక ప్రజలు ఎటువంటి అభివృద్ధికి నొచుకోలేదని, హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నా ఆంక్షల పేరుతో ఎటువంటి కట్టడాలకు అనుమతులివ్వక పోవడం, తద్వారా ఉపాది, ఆదాయం లభించక గ్రామీణ ప్రజలు ఎన్నో కస్టాలను అనుభవించారన్నారు. ఇన్ని ఏండ్లకు ముఖ్యమంత్రి, కేసీఆర్, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు మమ్ములను ఆ బాధలనుంచి విముక్తి చేశారన్నారు. 111 జీవోని పూర్తిగా ఎత్తి వేయడంతో చేవెళ్ళ నియోజక వర్గంలోని భూముల విలువ పదింతలు పెరిగి ఈ ప్రాంతమంతా బంగరు తునకగా మారిందన్నారు. గ్రామీణ ప్రజలు పండుగలు చేసుకుంటున్నారన్నారు. జీవో తొలగింపుతో ముఖ్యమంత్రి కేసీఆర్, మా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య లను ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారని, వారికి ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఋణపడి ఉంటారని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News