Sunday, October 6, 2024
HomeతెలంగాణMoinabad: ఉచిత ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Moinabad: ఉచిత ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత ఆపరేషన్లు

చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రతిఒక్కరికీ ఆరోగ్యం అందించాలన్న ఆలోచనతో అత్యవసర వైద్య సదుపాయాలు కల్గిన ఆరోగ్య రథం ప్రారంభించారు ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. చిలుకూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ ఆరోగ్యం అందించాలని తలంచి అన్ని వైద్య సదుపాయాలు ఉన్న ‘ఆరోగ్య రథం’ ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉచితంగా ఈ సేవలను అందించనున్నామని చెప్పారు. ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత ఆపరేషన్లు అందించనున్నామని, ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేటి నుంచి సంచార ‘ఆరోగ్యరథం’ చే మారుమూల గ్రామాలకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. కాలే యాదయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఎంతో సదుద్దేశంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించిన ఉచిత ‘ ఆరోగ్య రథం’ సేవలు ప్రతిఒక్కరు వినియోగించు కోవాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా చిలుకూరులోని బాలాజీని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు దర్శించుకున్నారు. ఆరోగ్య రథంని ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డికి పట్నం మహేందర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వారికి ఎమ్మెల్యే అభినదనలు తెలిపారు. కార్యక్రమంలో చిల్కూర్ గ్రామ సర్పంచ్ స్వరూప అండ్రుస్, మొయినాబాద్ మండల ఎంపీపీ నక్షత్రం, జెడ్పిటిసి కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు స్వప్న, సీనియర్ నాయకులు అనంతరెడ్డి, శ్రీహ రి యాదవ్, జగన్మోహన్ రెడ్డి రాఘవేందర్ యాదవ్, చదువు రాంచందర్, మహేష్ యాదవ్, పూసల పరమేష్, రాజు గౌడ్, రవుప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News