మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శ్రీరామ నగర్ సర్పంచ్ సంవల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మూర్తుజగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సామ రఘురాంరెడ్డి, ముకుందారెడ్డి, సామ రాజేందర్ రెడ్డి, కుమ్మరి రాములు, పాలమాకుల యాదయ్య, టి.గోపాల్, కుమ్మరి కుమార్, జె.నగేష్, రవి, బైకని విజయ్, రాగుల దర్శన్ రమేష్ తదితరులు బీజేపీ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ మండల నాయకులు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పట్లల్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, మొయినాబాద్ మోర్చా అధ్యక్షులు లక్ష్మీపతి యాదవ్, అశోక్ యాదవ్ మాదాపురం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.