తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ యూత్ విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మొయినాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షుడు పూసల పరమేష్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఆన్ని వర్గాలకు సమ న్యాయం జరిగిందని, ప్రజలు తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆయన అన్నారు. ప్రజలకు రక్షణ కరువవుతుందని తెలిపారు. కాలే యాదయ్య ప్రజలకు, పార్టీలోని కార్యకర్తకు సైతం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నానని ఆయన అన్నారు. కార్యకర్తలు ప్రజలు ఇలాంటి నాయకున్ని ఆదరించి గెలిపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య కోరారు. వారంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీ స్కీములకు మోసపోవద్దని కార్యకర్తలకు అభిమానులకు కాలే యాదయ్య పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం వైస్ ఎంపీపీ మమత జడ్పిటిసి శ్రీకాంత్, అనంతరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్, ఉపాధ్యక్షుడు గునుగుర్తి జయవంత్, బాలరాజ్ సుధాకర్ యాదవ్, టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సప్న ఏఎంసి వైస్ చైర్మన్ ఎంఏ రావు మాజీ వైస్ చైర్మన్లు డప్పు రాజు వెంకట్ రెడ్డి, నాయకులు గణేష్ రెడ్డి గీత వనజాక్షి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Moinabad: బీఆర్ఎస్ తోనే సంక్షేమ పథకాలు సాధ్యం
వారంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీ స్కీములతో మోసపోవద్దు