Mother Kills Kids and committed Suicide: క్షణికావేశం.. వారితో పాటు వారి రక్తసంబంధాన్ని కూడా పొట్టనపెట్టుకుంటోంది. కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి అమూల్యమైన మానవ జన్మను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. కడుపున పుట్టినందుకు కన్నపిల్లలను కూడా ఆ గొడవలకు బలిచేస్తున్నారు. సమస్యలకు లోబడి తల్లి పేగు ఇంత కఠినంగా మారుతుందా అనిపించేలా ఇటీవల జరుగుతున్న విషాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను అమానవీయంగా చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/chandana-brothers-founder-chandana-mohan-rao-passed-away/
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి శివారులోని వైట్ మార్కెట్ వద్ద నివసించే ఓ కుటుంబంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. తల్లి తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీపావళి రోజు ఆ ఇంట్లో వెలుగులు చిందాల్సింది పోయి కన్నీళ్ల సుడిగుండం వ్యాపించింది.
కాగా, మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగ లక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం నల్గొండ జిల్లాకు వలస వచ్చినట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే నాగలక్ష్మీ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నాగలక్ష్మి ముందుగా తన ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనతో జనకవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/sadar-celebrations-chief-guest-cm-revanth-reddy/
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.


