Friday, January 23, 2026
HomeతెలంగాణMP Chamala Kiran: ఎన్నికల్లో ఓడినా కేటీఆర్‌ బుద్ధి మారలేదు- ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌...

MP Chamala Kiran: ఎన్నికల్లో ఓడినా కేటీఆర్‌ బుద్ధి మారలేదు- ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

MP Chamala Kiran Kumar Reddy Satires to KTR: పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనపడుతోందని.. కేటీఆర్‌కి కూడా అలాగే ఉందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ.. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణకు మంచి చేయరని… కానీ తాము మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఫాం హౌస్ పాలన తప్ప ప్రజాపాలన ఎక్కడా చేయలేదని విమర్శించారు. 

- Advertisement -

‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేబినెట్‌లో అన్ని నిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ గతంలో ఒప్పుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తప్ప కేటీఆర్‌కు వేరే మార్గం లేదు. వ్యాపారవేత్తలను కేటీఆర్ బెదిరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని ఓడించినా కేటీఆర్‌ బుద్ధి మారలేదు. చివరికి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినా కేటీఆర్ మారడం లేదు.’ అని చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. 

Read More: https://teluguprabha.net/viral/surprise-proposal-for-smriti-mandhana-palash-shared-the-video/

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం కేటీఆర్‌కు ఏముందని ఎంపీ చామల ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో మాదిరి రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ పదవుల్లో లేరు కదా? అని నిలదీశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యీ బల్మూరి వెంకట్‌ కూడా పాల్గొన్నారు. 

ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిస్తేనే కేటీఆర్‌ తట్టుకోలేకపోతున్నారని.. ఇంకో రెండు ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ అమెరికా పారిపోతారని బల్మూరి వెంకట్‌ వ్యాఖ్యానించారు. నేతలు ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని.. జైలుకు పోవాలనే ఉత్సాహం కేటీఆర్‌కు ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. 

Also Read: https://teluguprabha.net/gallery/nara-bhuvaneshwari-travel-in-rtc-bus-with-free-ticket/

‘పదేళ్లు అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో కేటీఆర్ విర్రవీగుతున్నారు. రూ. 55 కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమిని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కేటీఆర్ కట్టబెట్టారు. ఫార్ములా ఈ కారు రేసు కేసు గురించి కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో ఒకలా, కోర్టులో మరొకలా చెబుతున్నారు. జాతిపితలా కేటీఆర్ బిల్డప్ ఇస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలపై మా ప్రభుత్వం లెక్కలతో సహా బయటపెట్టింది. కవిత ఆరోపణలపై కేటీఆర్, హరీశ్‌రావు వెంటనే స్పందించాలి. కేటీఆర్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. మరోవైపు అరెస్ట్ కాకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.’ అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News