అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్వాగతించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారని విమర్శించారు. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మానవత్వ కోణంలో మాట్లాడాడరని కొనియాడారు.
జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదని పవన్ మాట్లాడటం కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మంచి కళాకారుడంటూ సెటైర్లు వేశారు. సంక్రాంతి డ్యాన్సులు కూడా బాగానే చేస్తారని.. సినిమాల్లో అంబటికి మంచి రోల్ ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. దీంతో ‘పుష్ప2’ సినిమాకి మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చామల వెల్లడించారు.