Friday, September 20, 2024
HomeతెలంగాణMP Vaddiraju: మున్నూరు కాపుల క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు

MP Vaddiraju: మున్నూరు కాపుల క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు

రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం ప్రచురించిన నూతన సంవత్సర కేలండర్ (2024)ను ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో ఎంపీ రవిచంద్ర నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా పటేల్, ఉపాధ్యక్షులు గుమ్మడి వేణు పటేల్, రాయుడు పటేల్, మహేష్ పటేల్ అంజయ్య పటేల్, దేవేందర్ పటేల్, శ్రీధర్ పటేల్, రాజ బాబు పటేల్, సంఘం ప్రముఖులు కొత్త లక్ష్మణ్ పటేల్, ఆకుల శివ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం చైతన్య యాత్ర జ్ఞాపికను బహుకరించారు. వారంతా ఎంపీ వద్దిరాజుకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News