సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని OU ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్వర్యంలో MSF రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ అధ్యక్షతన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ పాల్గొని ప్రసంగించారు…దళిత బడుగు బలహీనవర్గాల చదువుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన దార్శనికుడు, అణిచివేతకు గురైన జాతులకు విద్యను అందించి మహాజన సమాజంలో వెలుగులు నింపిన క్రాంతిధార మహాత్ముడు జ్యోతిరావు పూలే అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి గురువు మహాత్మ జ్యోతిబాపూలే అట్లాంటి మహనీయుని జన్మదినానికి అధికారికంగా సెలవు ప్రకటించకుండా మహనీయుల పట్ల వివక్షను చూపటం తగదని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న OU యుద్ధనౌక వరంగల్ రవి మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు సత్యశోధక్ సమాజాన్ని ఏర్పరిచి ఈ దేశ అట్టడుగు వర్గాలకు ఎనలేని సేవ చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క విద్యార్థి పాటుపడాలని కోరారు.