బాణా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఆవుల భాస్కర్ రెడ్డి ( రిటైర్ ఐఆర్ఎస్) బాణా డెవలప్మెంట్ చైర్మన్ బాణాపురం టు బర్మా పుస్తకాన్ని ముదిగొండలో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణలో భాగంగా డాక్టర్ ప్రసాద్ రావు, ట్రాఫిక్ సిఐ అంజలి, బాణా ఫౌండేషన్ వైస్ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు, బాణా ఫౌండేషన్ ఇంచార్జ్ మాచర్ల వెంకట్, సర్పంచ్ ఆవుల రమలక్ష్మారెడ్డి, ఎం పి టి సి పచ్చ సీతారామయ్య, ఉప సర్పంచ్ చింతకాయల రామారావు, కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు.. పోతగాని మురళీ. విద్యాసాగర్, ఫిరోజ్, మాధవరావు, లక్ష్మీ ప్రసాద్, బిక్షం, ధర్మనాయక్ ,రమాదేవి, విజయలక్ష్మి, పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. యువతకు బంగారు భవిష్యత్తు ఉందని, ఆ భవిష్యత్ కు హాని కలిగించే మత్తు పదార్థాలకు, మద్యపానం కు బానిసలు కావొద్దని ఆవుల భాస్కర్ రెడ్డి ఈ సదస్సులో పేర్కొన్నారు. డాక్టర్ ప్రసాద్ రావు, ట్రాఫిక్ సీఐ అంజలి మాట్లాడుతూ .. మత్తులో డ్రైవింగ్ చేయరాదని, చిన్నపిల్లలకి బైకులు ఇవ్వద్దని, రహదారి భద్రత, 10వ తరగతి తరువాత విద్య ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.