హుజురాబాద్ లో గత రెండు రోజుల క్రితం యూట్యూబ్ కెమెరామెన్ బండి అజయ్ ముదిరాజ్ పై దాడి చేసి, ముదిరాజ్ కులాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎల్సి పాడి కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన అహంకారాన్ని నిరసిస్తూ గోదావరిఖని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ, తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నాయకులు మాట్లాడుతూ, కుల అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అండతో ముదిరాజ్ కులస్తులను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ కెమెరామెన్ బండి అజయ్ పై దాడి చేసిన విషయంలో ముదిరాజ్ జాతికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ పై ప్రజాక్షేత్రంలో నిలబడే గెలిచే సత్తా లేక ముదిరాజ్ కులంపై కుల అహంకారంతో దాడి చేస్తే సహించేది లేదని, అహంకారం ఆటలు సాగవని హెచ్చరించారు. క్షమాపణ చెప్పకపోతే మరింత ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన మాతో పెట్టుకుంటే ఉద్యమ ద్రోహికి బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయిని మధునయ్య ముదిరాజ్, సబ్బు మల్లయ్య ముదిరాజ్, పిడుగు కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, తూడి రాజయ్య ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, బర్ల మల్లయ్య ముదిరాజ్, శీలం శ్రీను ముదిరాజ్, రావుల స్వరాజ్ ముదిరాజ్, మహేందర్, నీరటి రమేష్, పిట్టల ఇస్తారి, ఓదెల రామస్వామి, గుర్రం సురేష్ ముదిరాజ్, కందుల సతీష్ ముదిరాజ్, మంద శ్రీనివాస్ ముదిరాజ్ పిట్టల సతీష్ ముదిరాజ్ పిట్టల మధు ముదిరాజ్, భునగిరి కుమార్ ముదిరాజ్, మంద రాజేష్ ముదిరాజ్. రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.