జిల్లాలోని ఏటూర్ నాగారం మండలాన్ని డివిజన్ కేంద్రంగా, ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే ధనసరి సీతక్క సి ఎస్ ను కోరారు. హైదరాబాదులో రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతకుమారిని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఏటూరునాగారం మండలంతో పాటు చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు మండలాలతో కలిపి డివిజన్ ఏర్పాటు చేయాలని, మల్లంపల్లి గ్రామాన్ని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు మండలంగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.
Mulugu: ఏటూరునాగారం డివిజన్ కేంద్రంతో పాటు మల్లంపల్లి మండలంగా ప్రకటించాలి
సీఎస్ ను కలిసిన సీతక్క