Saturday, November 23, 2024
HomeతెలంగాణMulugu: మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన

Mulugu: మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన

అభివృద్ధి పథంలోకి ములుగు

ములుగు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు.

- Advertisement -

ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ములుగు బహిరంగ సభలో మంత్రి హరీశ్ కామెంట్స్.. ములుగులో మెడికల్ కాలేజీ కోసం శంకుస్థాపన చేసుకోవడం సంతోషం జగదీష్ బతికి ఉంటే మెడికల్ కాలేజీ రావడం చూసి సంతోష పడేవాడు. కేసీఅర్ లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా..మెడికల్ కాలేజీ వచ్చేదా.. కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి ఈ ములుగు జిల్లానే. గుత్తూరు తండాలో 12 ఇల్లు కాలిపోయాయి. బిడ్డకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఆ తండ్రి ఉంటే ఆ పరిస్థితి చూసి కేసీఆర్ గారు చలించి పోయారు. ఆ పెళ్ళికి అండగా ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక అదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి ప్రారంబించారు. కులం లేదు, మతం లేదు పార్టీ లేదు, 12 లక్షల మంది అర్హులకు, 11 వేల కోట్లు ఇచ్చారు. అమ్మాయి తల్లి పేరు మీద చెక్ ఇచ్చారు సీఎం గారు. పోడు భూముల విషయంలో 4 లక్షల 6 వేల ఎకరాలు పోడు పట్టాలు ఇచ్చారు. ములుగు లోనే 14 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ ఇలా రైతులకు ఎన్నో చేశారు. ఉన్న కేసులు ఎత్తివేశారు. నక్సలైట్ ఉద్యమం ఇక్కడ పుట్టింది. కేసీఅర్ నాయకత్వంలో అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. నాడు ఎన్ కౌంటర్లు, రైతు చావులు, ఎరువుల కొరత, కరెంట్ కొరత. నేడు ఇంటింటికీ తెలంగాణ ప్రభుత్వం పథకాలు చేరువ అయ్యాయి. నాడు 30 శాతం డెలివరీలు, నేడు 76 శాతం అతి ఎక్కువ ప్రభుత్వ డెలివరీలు ఉన్న రెండో జిల్లా ములుగు. మొదటిది నారాయణ్ ఖెడ్ 83 శాతం ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు జరగటం సంతోషం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద సమయంలో ఏటూరు నాగారంలో డయాలసిస్ సెంటర్ పెట్టాం. సీఎం కేసీఆర్ గారికి దృష్టికి తీసుకువెళ్లి ముకుగుకు అదనంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తాం గూడేలు, తండాలు పంచాయతీలు చేసిన ఘనత సీఎం గారిది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. 2 లక్షల ర్యాంకు వచ్చిన మా గిరిజన పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లు వచ్చాయి. నాడు ములుగులో డాక్టర్ ఉండటం గొప్ప, నేడు డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్. మెడికల్ కాలేజీ అంటే చదువు మాత్రమే కాదు, 450 పడకల ఆసుపత్రి. అన్ని రకాల స్పెషాలిటీ వైద్యం ఇక్కడే అందుబాటులో వచ్చింది. ములుగు దవాఖానలో దాదాపు వంద మంది వైద్యులు ఉంటారు ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ వల్ల 2 లక్షల ర్యాంకు సీటు వచ్చింది. రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించారు కేసీఆర్ గారు, జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్:
ములుగు, నర్సంపేట మెడికల్ కాలేజీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాళ పెద్ద ఎత్తున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యం సామాన్యులకు చేరువైంది దేశంలో 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రం పై వివక్ష తో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, సీఎం కెసిఆర్ సొంతంగా మెడికల్ కాలేజీలు పెడుతున్నారు. • తెలంగాణకు జరిగిన ఈ అన్యాయంపై ఏ ఒక్క బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏనాడు మాట్లాడలేదు. ఒక్కనాడూ పార్లమెంట్ లో ప్రశ్నించలేదు. అభివృద్ధికి నోచుకోక ప్రాణాలు కోల్పోయిన చోట, ప్రాణాలకు తెగించి, తెలంగాణ తెచ్చిన సీఎం కెసిఆర్, ఇవ్వాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, 350 బెడ్స్ తో జిల్లా హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవ్వాళ ములుగు, నర్సంపేట మెడికల్ కాలేజీలకు మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్నాం ఒక్కో.మెడికల్ కాలేజీకి 183 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటివరకు 21 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాము. • మిగతా 8 కాలేజిలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించుకుంటాము. ఒకప్పుడు వైద్య విద్య కోసం బయటి దేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకునేవాళ్లం తల్లిదండ్రులకు ఆర్థికంగా బాగా భారం అయ్యేది. • తెలంగాణ ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అందులో 3 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఏర్పాటయ్యాయి. • 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో ఏర్పాటు చేసినవి రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. • 2014లో 5 మెడికల్ కాలేజీల ద్వారా 850 మెడికల్ సీట్లు ఉంటే, 2023 నాటికి 26 మెడికల్ కాలేజీలతో కలిపి మెడికల్ సీట్ల సంఖ్య 3 వేల 690కి చేరింది. • ప్రభుత్వ ప్రైవేటులో కలిపి ఏటా 10 వేల మంది విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది. వైద్యుల త‌యారీ క‌ర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం అవుతున్నది రాష్ట్రంలోని మెడిక‌ల్ కాలేజీల్లో 85శాతం సీట్లు స్థానికుల‌కే దక్కే విధంగా చట్టాన్ని మార్చారు ఇవ్వాళ ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోనే ఐదు మెడిక‌ల్ కాలేజీలు, హాస్పిట‌ల్స్‌ వచ్చాయి మెడిక‌ల్ హ‌బ్ గా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా కేంద్రం తయారైంది వ‌రంగ‌ల్ లో రూ.11 వందల కోట్ల‌తో అంత‌ర్జాతీయ స్థాయి సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ ఏర్పాటు అవుతున్నది దేశంలో వైద్య రంగంలో 3వ స్థానంలో రాష్ట్రం ఉంది బాగా చ‌దివి వైద్యులుగా మ‌న జిల్లాకు, రాష్ట్రానికి అంత‌ర్జాతీయ కీర్తిని తేవాలి సీఎం కెసిఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, హరీష్ రావు గారి ఎంతో కష్టపడి పని చేస్తున్నారు కెసిఆర్ గారి స్ఫూర్తి, హరీశ్ రావు గారి కృషి వల్లే ఇవ్వాళ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది ఒక విజన్ తో పని చేస్తున్న సీఎం కెసిఆర్ గారికి మనమంతా రుణ‌ప‌డి ఉండాలి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News