కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ డాక్టర్. శబరీష్ అన్నారు. జనజీవన స్రవంతిలో కలసి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని లొంగిపోయిన మావోయిస్టుల ఉపాధి తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీ శబరిస్ మాట్లాడుతూ నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కొంతమంది అగ్ర నాయకులు సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ- చతిస్గడ్ సరిహద్దు ప్రాంతాలలో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. తుపాకీ గొట్టం ద్వారా రాజాధికారం సాధించవచ్చు అనే అపోహ వదిలి ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో ఉన్నవారు లొంగిపోయిన పక్షంలో వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డు, జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తుందని డాక్టర్ శబరిష్ హామీ ఇచ్చారు.