Sunday, October 6, 2024
HomeతెలంగాణMulugu: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

Mulugu: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

వృద్ధులు-గుత్తి కోయిల కోసం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామ పంచాయితీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాల వద్ద ములుగు పోలీస్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వృద్ధులు మరియు గుత్తి కోయలు కొరకు “ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ ” అనే సంస్థ స్పాన్సర్షిప్ తో మెగా హెల్త్ క్యాంప్ ను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐ పి ఎస్ ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంప్ ప్రత్యేకతలు వివరిస్తూ వృద్ధులు-గుత్తి కోయిల కోసం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. కంటి చూపు లోపం ఉన్న అర్హులైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ వైద్య పరీక్ష క్యాంప్ లో భాగంగా వివిధ వ్యాధులకు ముందస్తుగా రక్త పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. బిపి సుషుర్ ఉన్న పేషెంట్ కి, కంటి పరీక్షలు గుండె సంబంధిత వ్యాధులను తెలుసుకోవడం కోసం ఈ.సీ.జీ, వంటి సంబంధిత బాధితులకు డెంటల్ చెక్ అప్ పరీక్షలు నిర్వహించి తగు మందులను అందజేస్తారని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -


ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేకంగా మహిళల గైనిక్ సమస్యల కోసం మొబైల్ అంబులెన్స్ ను ఎస్పీ గౌష్ అలం ప్రారంభించారు.ఎక్స్రే రేడియాలజీ ల్యాబ్ ను ఓ ఎస్ డి.అశోక్ కుమార్ ఐ పి ఎస్ ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు ముగిసిన ఉచితంగా మందులు అందజేశారు.మెడికల్ క్యాంపు కు వచ్చిన ఆదివాసీ ప్రజలతో ఎస్ పి, ఓ ఎస్ డి,ఏ ఎస్ పి పోలిష్ శాఖ అధికారులు కలిసి సహపంతి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్, ఏ ఎస్ పి సిరిశెట్టి సంకీర్త్,డాక్టర్ జవహర్ కెన్నేడీ,డి ఎస్ పి డి సి ఆర్ బి సుభాష్ బాబు,సి ఆర్ పి ఫ్ ఏ 58 కమాండంట్ ధనసే లక్ష్మ, సి ఐ ఏటూరునాగారం రాజు, సి ఐ వెంకటాపురం శివ ప్రసాద్,సి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఒబయ్య, ఎస్ ఐ వెంకటాపురం తిరుపతి రావు,ఎస్సై కన్నాయిగూడెం సురేష్,ఎస్ ఐ పేరూరు హరీష్ ,ఎస్సై వాజేడు అశోక్ ,ఇదిరా పి హెచ్ సి డాక్టర్ భవ్య శ్రీ, జెడ్ పి టి సి పాయం రమణ,ఆలుబాక సర్పంచ్ ఆదిలక్ష్మి, బోదాపురం సర్పంచ్ రాధా,ఆర్ ఎం పి డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు అశోక్ గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News