Monday, May 19, 2025
HomeతెలంగాణEncounter: ఎన్‌కౌంటర్‌పై ములుగు జిల్లా ఎస్పీ కీలక ప్రకటన

Encounter: ఎన్‌కౌంటర్‌పై ములుగు జిల్లా ఎస్పీ కీలక ప్రకటన

Encounter| ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై ములుగు జిల్లా ఎస్పీ(Mulugu District SP) శబరీశ్ కీలక ప్రకటన చేశారు.

- Advertisement -

మావోయిస్టులు ఇటీవల వాజేడులో ఇద్దరు అమాయకులను చంపారని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలో గస్తీ పెంచామని వెల్లడించారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందానికి మావోయిస్టులు ఎదురుపడ్డారని పేర్కొన్నారు. పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. లొంగిపోవాలని హెచ్చరించినా ఆపకుండా కాల్పులు జరిపారని.. ఇక చేసేదేమీ లేక ఆత్మరక్షణ కోసం భద్రతాదళాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. కాల్పుల అనంతరం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు గుర్తించామని చెప్పారు. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… సంవత్సరం కాలంలోనే మళ్లీ ఎన్‌కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఫైర్‌ అయ్యారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News