కళ్యాణలక్ష్మి/షాదిముభారక్ పథకం పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఅర్ అందించిన వరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ఈ పథకంతో కోటానుకోట్ల మంది లబ్ది పొందారని ఆయన వెల్లడించారు. కోదాడ నియోజకవర్గం పరిధిలోని మునగాల మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన కళ్యాణలక్ష్మి/షాది ముభారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక శాససభ్యులు బోల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 154మంది కళ్యాణలక్ష్మి/షాదిముభారక్ లబ్దిదారులకు కోటి 54 లక్షల 17వేల వేల 864 రూపాయల చెక్కుల పంపిణీ చేశారు.అదే విధంగా 21 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆరు లక్షల 77 వేల 500 రూపాయల చెక్ లను మంత్రి జగదీష్ రెడ్డి అంద జేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ సంక్షేమ రంగానికి అందులో ప్రధానంగా మహిళలకు పెద్ద పీట వేశారనడానికి కళ్యాణలక్ష్మి/షాదిముభారక్ పథకాలు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల పేరుతో దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు అధిగమించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. అదే విధంగా తర తమ బేధం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదప్రజలకు బాసటగా నిలిచిందన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారు ఆసు పత్రుల పాలైతే ఆర్దికంగా చితికి పోకుండా ఉండేందుకు గాను ముఖ్యమంత్రి సహాయనిధి దోహద పడుతుందని ఆయన తెలిపారు. స్థానిక శాససభ్యులు బోల్లం మల్లయ్య యాదవ్ తో పాటు రైతు సమన్వయ అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, ఎంపీపీ నరేందర్ రెడ్డి, జెడ్పిటిసి నలపాటి ప్రమీల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నిరంజన్, తాసిల్దార్ జోహార్ లాల్, పంచాయతీరాజ్ డిఇ పాండు నాయక్, సర్పంచులు చింతకాయల ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.