తెలంగాణలో రానున్నది బిజెపి డబ్బులు ఇంజన్ సర్కారని నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్ అన్నారు. కొల్చారం మండలంలోని కొంగోడు నాయిని జలాల్పూర్, అంసన్ పల్లి, రాంపూర్ ,కిష్టాపూర్ గ్రామాలలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్లో ఎంపీటీసీ సభ్యురాలు సామల మమతా యాదగిరి, మాజీ సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రభాకర్ ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది ప్రజలు కార్యకర్తలు అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను నిర్దేశించి మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే పనిచేసారన్నారు. దీంతో గ్రామాలలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏమాత్రం అభివృద్ధికి గ్రామాలు అభివృద్ధి చెందట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. సునీతా రెడ్డి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గానికి చేసింది ఏమి లేదన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆమెకు సమయం చాలాదన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు దయాకర్ గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ సురేష్ గౌడ్, బూత్ కమిటీ కన్వీనర్ యాదగిరి, జలాల్పూర్ శక్తి కేంద్రం ఇంచార్జి నర్సింలు, గిరి, పోచయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.