ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరి బ్రిడ్జి వద్ద చెత్తా చెదారం పేరుకుపోవటంతో మూసీ నది కాలుష్యమయంగా మారింది. కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి, ఇక్కడి నీళ్ల పైన ఉన్న చెత్తా చెదారాలను తొలగించాలని అధికారులకు సూచించారు. దీంతో మలేరియా సిబ్బంది చెత్తా చెదాన్ని తొలగించే పనులు ప్రారంభించగా, వీటిని కార్పొరేటర్ పర్యవేక్షిస్తున్నారు.