నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పాల్గొని ప్రచారం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, పథకాలను ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి పలాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. అనంతరం 11వ వార్డులో నిర్మించిన కల్వర్టు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Nadipelli Diwakar Rao: నస్పూర్ లో గడపగడపకు బిఆర్ఎస్
పాల్గొన్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES