బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డ్ కృష్ణ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నస్పూర్ మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని, మరోసారి నన్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానాని ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఛైర్మెన్ ఈసంపల్లి ప్రభాకర్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి వేల్పుల రవీందర్ టీబీజీకేఎస్ నాయకులు కె.సురేందర్ రెడ్డి, డికొండ అన్నయ్య, రౌతు రజిత, కార్యదర్శి కె.జ్యోతి, కౌన్సిలర్స్, కోడూరి లహరి, పంబాల గంగ ఎర్రయ్య, బడికే లక్ష్మి, బండి పద్మ, బౌతు లక్ష్మి, మడిగే మల్లయ్య, అన్నపూర్ణ, బేర సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లు కమలాకర్ రావు, రాజేంద్ర పాణి, తిప్పని రామయ్య, గుంట జగ్గయ్య, ఎస్సి సెల్ అధ్యక్షులు గరిసే రామస్వామి, వార్డుల అధ్యక్షులు జక్కుల కుమార్, రఫీఖాన్, తిప్పని బానేష్, రవి తదితరులు పాల్గొన్నారు.