Wednesday, October 23, 2024
HomeతెలంగాణKonda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున పిటిషన్.. విచారణ అక్టోబర్ 30కు వాయిదా

Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున పిటిషన్.. విచారణ అక్టోబర్ 30కు వాయిదా

Konda Surekha| తన కుటుంబం పరువుకు నష్టం కలిగించారంటూ మంత్రి కొండా సురేఖపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే విచారణ జరిగిన విషయం విధితమే. తాజాగా ఈ దావాపై మరోసారి విచారణ జరిగింది. మంత్రి సురేఖ తరపున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ దాఖలు చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి న్యాయస్థానం వాయిదా వేసింది.

- Advertisement -

మరోవైపు ఇదే కేసులో బీఆర్ఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కూడా మంత్రి సురేఖపై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై న్యాయమూర్తి ముందు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ తదితర బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

కాగా కొన్ని రోజుల క్రితం నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య(Nagachaitnya), సమంత(Samanta) విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే చైతన్య, సమతం విడిపోయారంటూ సురేఖ చేసిన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. సురేఖ వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News