ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కృష్ణ కుమార్తె చిన్నారి కృతిక వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మళ్ళీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన కిడ్డి బ్యాంక్ లో దాచుకున్న 3,840/- ఎన్నికల ఖర్చు నిమిత్తం మంత్రికి విరాళంగా అందజేశారు. చిన్నారి కృతిక అభిమానానికి మంత్రముగ్ధుడైన మంత్రి చిన్నారిని గారాబం చేశారు. కల్మషం లేని చిన్నారి మనసు తనపై ఇంత అభిమానం చూపడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. కృతిక తన సోదరి కార్తీకకు మంత్రి శుభాశీస్సులు అందించారు.