Friday, November 22, 2024
HomeతెలంగాణNalgonda: దశాబ్ది ఉత్సవాలకు గుత్తాను ఆహ్వానించిన కలెక్టర్

Nalgonda: దశాబ్ది ఉత్సవాలకు గుత్తాను ఆహ్వానించిన కలెక్టర్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని, జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి, ఎస్.పి. అపూర్వ రావులు నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై, జాతీయ జెండాను అవిష్కరించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహించాలి అనే విషయంపై కాసేపు చర్చించారు. దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు, అధికారులు సమన్వయం తో ఏర్పాట్లు చేయాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ సర్కారు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన దక్షతతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సి.పి.ఓ బాల శౌరి ,డి.పి.ఆర్.ఓ శ్రీనివాస్, డి. ఈ. ఓ భిక్షపతి,కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీ లాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News