Saturday, November 15, 2025
HomeతెలంగాణNalgonda: గర్జించిన మహిళా లోకం

Nalgonda: గర్జించిన మహిళా లోకం

ప్రధాని మోదీ మోసం బట్టబయలు అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారత దేశంలో ప్రజల నుండి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతిలకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును ఆదాని,అంబానీ లకు దోచి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.అందులో మెజారిటీ మొత్తం తెలంగాణా ప్రజల సొమ్మే నని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఖాళీ సిలిండర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్ద గడియారం చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

మోదీ ప్రధానిగా ఎన్నికయిన రోజున 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 1200 కు పెరగడమే మోదీ ని ప్రజలు గుర్తుంచుకోవడానికి కారణమైందని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడూ… ఇప్పుడూ 100 డాలర్లే నన్నారు. అటువంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమెందని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బిజెపి వంచన చేరారని ఆయన దుయ్యబట్టారు. ఇద్దరు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. గుజరాత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి రాహుల్ గాంధీ ఎగనామం పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. అంతెందుకు మునుగోడు లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు భారత జోడో యాత్ర పేరుతో తెలంగాణాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మునుగోడు ఎన్నికల ప్రచారానికి రాక పోవడం వెనుక దాగి ఉన్న మర్మం కూడా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీకి ఉన్న సంబంధాలే కారణమన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad