Saturday, November 23, 2024
HomeతెలంగాణNama: నామా న్యూ రికార్డ్, పార్లమెంట్ కు 88.3 శాతం హాజరు

Nama: నామా న్యూ రికార్డ్, పార్లమెంట్ కు 88.3 శాతం హాజరు

202 ప్రశ్నలు సంధించిన నామ

ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు అరుదైన రికార్డు నెలకొల్పారు. 17వ లోక్ సభకు తెలంగాణ నుంచి అత్యధిక రోజులు హాజరైన ఎంపీల్లో నామ నాగేశ్వరావు టాప్ లో ఉన్నారు. మొత్తం 273 రోజులకుగాను 241 రోజులు (శాతం 88.3) ఆయన సభకు హాజరై.. వివిధ సమస్యలపై 202 ప్రశ్నలు అడిగారు. నామా తర్వాత ఎక్కువ రోజులు హాజరైన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నారు. ఈయన 240 రోజులు హాజరై.. 78 ప్రశ్నలు మాత్రమే అడిగారు. తెలంగాణ నుంచి అత్యధికంగా ప్రశ్నలు అడిగిన బీఆర్ఎస్ లోక్ సభ సభ్యుల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయన 194 రోజుల్లో 345 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ప్రాంత సమస్యలను ఖమ్మం జిల్లా ప్రజల ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పార్లమెంటులో గళం ఎత్తి దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంటులో 88.3 % శాతం హాజరై తెలంగాణ, ఖమ్మం ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాడి నెరవేర్చిన నేత నామ నాగేశ్వరావుకు అభినందనలు వెల్లువెత్తు తున్నాయి.

- Advertisement -

పార్టీలకు అతీతంగా ఆదరించి, మళ్లీ ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రయోజనాల కోసం మీ సేవలను పొందుతామని ప్రజలు అంటున్నారు. ఎంపీ పదవికి వన్నె తీసుకురావడమే కాదు తెలంగాణ రాష్ట్ర సాధన నాటి నుండి నేటి వరకు రాష్ట్రానికి, జిల్లాకు కేంద్రం నుండి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు కోసం పార్లమెంట్ లో రాష్ట్ర ప్రజల గొంతుకను వినిపించి ఉమ్మడి ఖమ్మం జిల్లా గౌరవాన్ని మరింతగా పెంచిన నాయకుడు నామ నాగేశ్వరరావు అని ప్రశంశలు అందుకుంటున్నారు. ఎన్నో సమస్యల పై ఎన్నో బిల్లులపై పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో పాల్గొని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అద్భుతంగా మాట్లాడిన నామను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ తో గెలిపించి మళ్లీ పార్లమెంట్ కు పంపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News