Saturday, November 23, 2024
HomeతెలంగాణNama: మ్యానిఫెస్టో అద్భుతం

Nama: మ్యానిఫెస్టో అద్భుతం

బ్రహ్మాండంగా ఆకట్టుకునేలా ఉంది

బడుగు, బలహీన వర్గాల సర్వతో ముఖాభివృద్దే లక్ష్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రూపొందిందని పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం 54వ డివిజన్ వీడియోస్ కాలనీలో ఆడిటర్ శివరామకృష్ణ గారి ఇంటి వద్ద సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో నామ మాట్లాడారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. దీని ద్వారా మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణా గురించి, తెలంగాణా ప్రజల గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. అందుకే ఆయన మదిలో బ్రహ్మాండంగా అవిష్కృతమైందే పార్టీ మ్యానిఫెస్టో అన్నారు.

- Advertisement -

రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో అన్నీ చూశానని, నిత్యం ప్రజల గురించి ఆలోచించే కేసీఆర్ కు అండగా నిలిచి, అక్కున చేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్నాటి కృష్ణ, కేఎస్ బాబ్జీ,బత్తుల మురళీ, పారా నాగేశ్వరరావు, దుద్దుకూరి సత్యనారాయణ, పుతుoబాక నరేష్, ఆడిటర్ శివరామకృష్ణ, వల్లభనేని రామారావు, మోరంపూడి ప్రసాద్, గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, నామ సేవా సమితి నుంచి చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నామ నాగేశ్వరరావు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకే సాధ్యమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం వీడియోస్ కాలనీలో టీఎస్ జెన్కో రిటైర్డ్ ఏడీఏ మధుసూదన్ రావు ఇంటి వద్ద కేటీపీఎస్ రిటైర్డ్ ఇంజనీర్లు, ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కేటీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ ఎంపీ నామ కింది స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి, పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై హిందీలో ఎంతో సమర్థవంతంగా మాట్లాడడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కరోనా సమయంలో సొంత డబ్బు ఖర్చు చేసి, సేవాలందించారని అన్నారు. అంతేకాకుండా నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్ ఎలక్ట్రసిటీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎ. మధుసూధన్ రావు,ఈశ్వరయ్య, వీరభద్రం, నిరంజన్ రెడ్డి, సత్యనారాయణ, బాపయ్య, కోటేశ్వరరావు, బాబు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News